పరిపాలనను పారదర్శకంగా, ప్రజాకేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు.
హనుమకొండ జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన చాహత్ బాజ్ పాయ్ గారు హైదరాబాద్‌లో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.
జిల్లా అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాధాన్యతా ప్రాజెక్టులు, ప్రజా సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చర్చించారు. పరిపాలనను పారదర్శకంగా, ప్రజాకేంద్రీకృతంగా ముందుకు తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాలని నిర్ణయించారు. జిల్లా పురోగతికి అవసరమైన సూచనలు మంత్రి గారు అందించినట్లు సమాచారం.